Krishnam Raju: తన మరణం ఎలా ఉండాలో ముందే చెప్పినా కృష్ణంరాజు

Krishnam Raju: అలా మరణించాలి అనుకున్న కృష్ణంరాజు

Jyothi
Published on: 13 Sept 2022 11:19 AM IST
Krishna Raju Thought He Should Die Like That
X

Krishnam Raju: తన మరణం ఎలా ఉండాలో ముందే చెప్పినా కృష్ణంరాజు

Krishnam Raju: ఒక మనిషి ఎంత కాలం జీవిస్తారు అనే విషయం ఎవరు చెప్పలేరు. కొంతమంది చిన్నవయసులోనే హఠాత్ మరణం పొందుతారు. మరి కొందరు దీర్ఘకాలం జీవిస్తారు. కానీ ఏదో ఒక సమయంలో ప్రతి మనిషికి తన చావు గురించిన ఆలోచన వస్తుంది. ఎలా చనిపోవాలి, తన మరణం ఎలా ఉండాలి అని కోరికలు కూడా కలుగుతాయి. రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా తన చావు ఎలా ఉండాలో ముందుగానే ఊహించుకున్నారు. ఆదివారం నాడు కృష్ణంరాజు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు పదేళ్ల క్రితం తన చావు గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

"ప్రతి మనిషికి జీవిత లక్ష్యం ఒకటి ఉండాలి అంటారు. దీని గురించి రాజుగారికి నాకు మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరిగింది. అప్పుడు నా మరణం ఎలా ఉండాలి అని ఆయనతో పంచుకున్నాను. పచ్చని చెట్టు నీడలో నా జీవితంలో నేను ఎవరికీ అన్యాయం చేయలేదని గుండెల మీద చేతులు వేసుకొని నిర్మలమైన ఆకాశం వైపు చూస్తూ తుది శ్వాస విడవాలి. ఇదేనా కోరిక" అని రెబల్ స్టార్ అప్పుడు చెప్పుకొచ్చారు. అలాగే ఆసుపత్రికి వెళ్లకుండా ఎలాంటి బాధ అనుభవించకుండా ప్రశాంతంగా కృష్ణంరాజు చనిపోవాలనుకున్నారు. కానీ అనారోగ్యం కారణంగా కృష్ణంరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Jyothi

Jyothi

Next Story