క్రిష్ తదుపరి చిత్రం అదేనా ...

క్రిష్ తదుపరి చిత్రం అదేనా ...
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయి లో ఆడలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశల నడుమ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అయ్యింది. అయితే...

ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయి లో ఆడలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు, ఎన్నో ఆశల నడుమ ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అయ్యింది. అయితే సినిమా లో కావాల్సిన కంటెంట్ లేకపోవడం తో దారుణం గా బాక్స్ ఆఫీస్ వధ్ద చతికిలపడింది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఆల్రెడీ బోయపాటి తో సినిమా ప్రకటించాడు కానీ అందరి చూపు దర్శకుడు క్రిష్ వైపే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ ని ఆ మాత్రం జనాలు అయినా చూసారు అంటే దానికి క్రిష్ ముఖ్య కారణం అని ఖఛ్చితంగా చెప్పాలి. అయితే సినిమా ఆడకపోవడం, అదే సమయం లో మణికర్ణికా వివాదం తన మెడ చుట్టూ ఉండడం తో క్రిష్ వెంటనే తన తదుపరి చిత్రం పైన ఫోకస్ పెట్టలేకపోయాడు.

అయితే తాజా ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని తెలుగు లో ఒక స్టార్ హీరో తో చేయనున్నాడు అని తెలిసింది. ముందుగా హిందీ లో ఒక సినిమా చేయాలనీ అనుకున్నా క్రిష్ మాత్రం తెలుగు లో హిట్ కొట్టాక నే బాలీవడ్ పయనం అవుదాం అని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రచయిత సాయి మాధవ్ బుర్రా తో కలిసి తన తదుపరి చిత్రానికి స్క్రిప్ట్ సమకూర్చే పనిలో క్రిష్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నాడు. అతి త్వరలో ఈ సినిమాకి సంబందించిన ఒక అధికారిక సమాచారం మనకి అందనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories