Raviteja Krack Movie: తెలుగు రాష్ట్రాల్లో ఆగిన తొలి ఆట

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్‌'.

Samba Siva Rao
Updated on: 9 Jan 2021 10:13 AM IST
Raviteja Krack Movie: తెలుగు రాష్ట్రాల్లో ఆగిన తొలి ఆట
X

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్‌'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 9న అంటే ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. అయితే అనూహ్యంగా సినిమా విడుదల ఆగిపోయింది. డాన్ శీను', 'బలుపు' చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కాంబోలో వస్తునన్న చిత్రం కావడంతో 'క్రాక్'పై భారీ అంచనాలున్నాయి. వరుస వైఫల్యాలతో ఉన్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ, అనివార్య కారణాల వల్ల అవి కాస్తా రద్దు అయ్యాయి. రవితేజ అభిమానులు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో 'క్రాక్' మార్నింగ్ షో ఆగిపోయిందని తెలుస్తోంది. డిస్టిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్‌మెంట్లు పూర్తవకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. దీనిపై రవితేజ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో షోలు 9 గంటల నుంచి పడతాయని 'క్రాక్' పీఆర్ టీమ్ స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్లలో ఉదయం 11 గంటల షోకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించారు. రవితేజ సరసన హీరోయిన్ గా శ్రుతీ హాసన్ నటిస్తోంది. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ తెలుగు సినిమాలో నటిస్తుంది. నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story