స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుపై డిస్ట్రిబ్యూటర్ శ్రీను సంచలన ఆరోపణలు

Arun Chilukuri
Published on: 14 Jan 2021 12:40 PM IST
Krack Movie Distributor Srinu Fires On Dil Raju & Sirish Reddy
X

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుపై డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను సంచలన ఆరోపణలు చేశారు. నైజాంలో థియేటర్స్‌పై ఒక నియంత పాలన జరుగుతోందని విమర్శలు గుప్పించారు. దిల్‌రాజు, శిరీష్‌రెడ్డి నైజాంలో పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. మంచి ఆదరణ లభిస్తున్న క్రాక్ సినిమాను థియేటర్ల్ నుంచి తీసేస్తున్నారన్న శ్రీను ఏడాది క్రితమే తాను క్రాక్ సినిమా ప్రొడ్యూసర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. క్రాక్ సినిమా హిట్ అయినా థియేటర్స్ లాగేసుకుంటున్నారని ఆరోపించిన శ్రీను దిల్‌రాజు, శిరీష్‌రెడ్డి వల్ల ఇబ్బంది పడుతున్నందుకే మీడియా ముందుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

మరోవైపు ప్రొడ్యూసర్ దిల్‌రాజుపై డిస్టిబ్యూటర్ శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్‌రాజు కాదు కిల్ రాజు అంటూ విమర్శించారు. డిస్టిబ్యూటర్లను కిల్ చేసే వ్యక్తి దిల్‌రాజు అన్న శ్రీను తనను పదిమందిలో అవమానించినట్లు ఆరోపించారు. నైజాంలో వాళ్లనుంచి స్వతంత్రం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని దిల్‌రాజు, శిరీష్‌ వాళ్లు మాత్రమే బతకాలనుకుంటారని విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story