ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ ఆత్మహత్య

*అతి పిన్న వయసులోనే పాప్ సింగర్‌గా గుర్తింపు

Jyothi
Published on: 16 May 2023 9:39 AM IST
Korean Pop Singer Haesoo Dies by Suicide
X

ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ ఆత్మహత్య

Pop Singer Haesoo: ప్రముఖ కొరియన్ సింగర్ హెసూ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె వయస్సు 29 ఏళ్లు. అతి తక్కువ సమయంలోనే మంచి సింగర్‌గా పేరు సంపాదించుకున్న హెసూ.. హోటల్ రూంలో విగతజీవిగా కనిపించారు. ట్రాట్ సింగర్ హెసూ బలవన్మరణంతో ముందుగా ప్రకటించిన కార్యక్రమానికి హాజరుకావడం లేదని నిర్వాహకులు తెలుపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో సూసైడ్ నోట్ లభించడంతో మరిన్ని వివరాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. 2019లో ఆమె 'మై లైఫ్, మి అనే సింగిల్ ఆల్బంతో కెరీర్‌ ప్రారంభించారు.

గయో స్టేజ్, హ్యాంగవుట్ విత్ యూ, ది ట్రాట్ షో వంటి ఆల్బమ్స్‌తో గొప్ప పేరు తెచ్చుకున్నారు. హెసూ చనిపోయే ముందు రోజు కూడా సోషల్ మీడియాలో రోజూలాగానే తన ఫ్యాన్స్‌తో ఎన్నో విషయాలు షేర్ చేశారు. ఈ యువ సింగ్ మరణం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆమె ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు.

Jyothi

Jyothi

Next Story