ఎన్టీఆర్ కోసం సీనియర్ హీరోయిన్ ని రంగంలోకి దింపనున్న కొరటాల

*అనిల్ రావిపూడి బాటలో వెళ్ళనున్న కొరటాల శివ

Jyothi
Updated on: 7 Sept 2022 2:31 PM IST
Koratala Siva Selected Senior Heroine for NTR Film
X

ఎన్టీఆర్ కోసం సీనియర్ హీరోయిన్ ని రంగంలోకి దింపనున్న కొరటాల

Tollywood: ఇప్పటిదాకా వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరియర్ లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకు వెళ్లిన కొరటాల శివకు ఈ మధ్యనే ఆచార్య సినిమాతో ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా అయినప్పటికీ "ఆచార్య" బాక్సాఫీస్ వద్ద చతికిలబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొరటాల శివ తన ఆశలన్నీ ఎన్టీఆర్ సినిమా పైన పెట్టుకున్నారు. ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల డైరెక్షన్లో #ఎన్టీఆర్30 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.

ఇక ఈ సినిమా తో అభిమానుల దృష్టిని ఆకర్షించడానికి కొరటాల శివ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కొరటాల శివ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం ఒక సీనియర్ హీరోయిన్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ హీరోయిన్ మరెవరో కాదు విజయశాంతి. ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీ ని ఏలిన విజయశాంతి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినిమాలకి దూరమయ్యారు తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో మళ్లీ ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ ఇచ్చిన విజయశాంతికి కొరటాల శివ కథను నేరెట్ చేశారట. విజయశాంతికి కూడా తన పాత్ర బాగానే నచ్చడంతో సినిమాకి ఓకే చెప్పిందని తెలుస్తోంది. మరి విజయశాంతి నటిస్తున్న ఈ సినిమాతో కొరటాల ఎంతవరకు హిట్ అందుకుంటారో చూడాలి.

Jyothi

Jyothi

Next Story