ధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ

Koratala Siva: కొరటాల శివ ఎక్స్పరిమెంట్ ఫలిస్తుందా

Jyothi
Published on: 21 May 2022 12:25 PM IST
Koratala Siva Says Fear Is greater Than Courage
X

ధైర్యం కంటే భయం గొప్పది అంటున్న కొరటాల శివ

Koratala Siva: ఈ మధ్యనే ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఆదుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ ఈ మధ్యనే విడుదల అయింది. ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ధైర్యం ఒక రోగం లా మారితే భయమే దానినీ నయం చేస్తుంది అనే క్యాప్షన్ తో ఈ సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. "అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తను ఉండకూడదని.. అప్పుడే భయానికి తెలియాలి తను రావలసిన సమయం వచ్చిందని.. వస్తున్నా" అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసింది. నిజానికి భయం కన్నా నమ్మకం గొప్పది అని పురాణాల్లో కూడా ఉంది.

అలాంటిది ఇప్పుడు కొరటాల శివ నమ్మకం అంటే భయం గొప్పది అంటూ ఒక సరికొత్త పాయింట్తో సినిమా తీస్తున్నట్లు కనిపిస్తోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా "ఖలేజా" ను తీశారు. కానీ అది ప్రేక్షకుల బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. మరి ఈ సినిమాతో కొరటాల శివ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తారో చూడాలి.

Jyothi

Jyothi

Next Story