తనపై కేజీఎఫ్ ఇన్ఫ్లూయెన్స్ ఉంది అంటున్న కొరటాల శివ...

Koratala Siva: ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే...

Shireesha
Updated on: 22 May 2022 2:01 PM IST
Koratala Siva Said KGF Movie Influenced Him | NTR30 | Live News Today
X

తనపై కేజీఎఫ్ ఇన్ఫ్లూయెన్స్ ఉంది అంటున్న కొరటాల శివ...

Koratala Siva: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాతో తన కెరీర్ లో మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్న కొరటాల శివ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అందులో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమా పై మరింత అంచనాలను పెంచింది. అయితే ఈ సినిమా తరువాత మాస్ ప్రేక్షకులలో హీరో ఎలివేషన్ మీద, సినిమాలో కంటెంట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా దీని గురించి రియాక్ట్ అయ్యారు కొరటాల శివ. కే జి ఎఫ్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ తన మీద కూడా ఉంది అని ఒప్పుకున్న మొట్ట మొదటి డైరెక్టర్ గా మారారు కొరటాల.

ఇప్పటికే మిర్చి, భరత్ అనే నేను వంటి సినిమాలతోనే మాస్ ప్రేక్షకులను అలరించిన కొరటాల శివ ఈ సినిమాతో కూడా అంతే మెప్పిస్తారు అని అభిమానులు విశ్వసిస్తున్నారు. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ మరియు కొరటాల ఎంత వరకు మెప్పిస్తారో వేచి చూడాలి.

Shireesha

Shireesha

Next Story