'ఆచార్య' కోసం 'సిద్ధ' వచ్చేశాడు! కేక పుట్టిస్తున్న రామ్ చరణ్ గెటప్!!

K V D Varma
Updated on: 17 Jan 2021 12:05 PM IST
Ramcharan pre look for Acharya revealed by Koratala Siva
X

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ప్రీ లుక్ పోస్టర్ (ట్విట్టర్)

మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం అత్యంత భారీ ఆలయం సెట్ వేసిన యూనిట్ ఆ సెట్ లో నిర్విరామంగా షూటింగ్ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే చిరంజీవి విడుదల చేసిన ఈ సినిమా ఆలయం సెట్ సినిమా పై విపరీతమైన ఆసక్తిని పెంచింది. ఇక ఆచార్యకు సంబంధించిన ప్రతి విషయమూ వైరల్ గా మారిపోతోంది. తాజాగా సినిమా యూనిట్ రామ్ చరణ్ ప్రీ లుక్ కి సంబంధించిన ఓ పోస్టర్ విడుదల చేసింది. రామ్ చరణ్ సినిమా షూటింగ్ లో ఈరోజు నుంచి పాల్గోబోతున్నారు. ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను కొరటాల శివ తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ లుక్ విడుదల చేసి అభిమానులకు పండగ చేశారు కొరటాల.

మేడలో రుద్రాక్ష వేసుకుని.. చెవిపోగుతో ఆలయంలోకి అడుగు పెడుతున్న రామ్ చరణ్ లుక్ ఆదరిపోయిందని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో రామ్ చరణ్ నక్సలైట్ గా కనిపిస్తారని ఇప్పటివరకూ వార్తలు షికార్లు చేశాయి. ఇప్పుడు ఈ లుక్ చూస్తుంటే అలా అనిపించడం లేదు.

ఇక ఈ పోస్టర్ విడుదల చేస్తూ కొరటాల శివ మా ' సిద్ధ ' సర్వం సిద్ధం అంటూ ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక రామ్ చరణ్ గతంలో చిరంజీవి తో కలిసి మగధీర, బ్రూస్లీ, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో కనిపించారు. కానీ, అవి చాలా కొద్ది సేపు కనిపించిన ఒకటి రెండు సీన్లు మాత్రమె. తొలిసారి తండ్రితో కలిసి తెరపై పెద్ద నిడివి ఉన్న పాత్రలో రామ్ చరణ్ కనిపినచానున్నారు. దీంతో ఈ సినిమా పై ఇప్పటికే అభిమానుల్లోనూ.. ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పోస్టర్ లుక్ తో ఆ అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.


K V D Varma

K V D Varma

Next Story