Koratala Siva: మరో సీనియర్ హీరో తో చేతులు కలపనున్న కొరటాల శివ

Koratala Siva: బాలకృష్ణ కోసం కథ రెడీ అంటున్న స్టార్ డైరెక్టర్

admin1
Updated on: 18 Nov 2021 5:30 PM IST
Koratala Siva Ready the Story for Hero Balakrishna
X

బాలకృష్ణ కోసం స్టోరీ రెడీ అంటున్న కొరటాల శివ (ఫైల్ ఇమేజ్)

Koratala Siva: రైటర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టినా కొరటాలశివ ఇప్పుడు ఇండస్ట్రీ లోనే స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్బస్టర్స్ ను అందించిన కొరటాల శివ ఇప్పుడు "ఆచార్య" సినిమాతో మెగా స్టార్ చిరంజీవి హీరోగా కూడా సినిమా చేశారు. ఇక తాజాగా ఇప్పుడు మరొక సీనియర్ హీరో తో సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ.

బాలయ్య కి మాత్రమే సెట్ అయ్యే కథ కొరటాల శివ దగ్గర రెడీగా ఉందట. దాన్ని త్వరగా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఇప్పటిదాకా కొరటాల శివ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ లే కాబట్టి కొరటాల శివ అడిగితే ఏ హీరో కూడా నో చెప్పడు. బాలకృష్ణ కూడా కొరటాల శివ ని రిజెక్ట్ చేయరు కాబట్టి కొరటాల బాలయ్య కాంబో దాదాపు ఫిక్స్ అనే చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం బాలకృష్ణ మరియు కొరటాల శివ కి ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తరువాత మాత్రమే వీరిద్దరి ప్రాజెక్ట్ పట్టలెక్కనుంది.

admin1

admin1

Next Story