ఆచార్య సినిమా రీషూట్ పైన రియాక్ట్ అయిన కొరటాల శివ

*ఆచార్య సినిమా రీషూట్ పైన రియాక్ట్ అయిన కొరటాల శివ

Rama Rao
Updated on: 20 April 2022 10:30 AM IST
Koratala Siva Reacts on Acharya Movie Reshoot | Telugu Movie News
X

 ఆచార్య సినిమా రీషూట్ పైన రియాక్ట్ అయిన కొరటాల శివ

Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆచార్య". ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు ఎలాంటి రీషూట్ చేయాలని చేయలేదని, వచ్చిన అవుట్పుట్ తో కొరటాల శివ బాగా సాటిస్ఫై అయ్యారని అందుకే ఎలాంటి రీషూట్ ప్లాన్ చేయలేదని పుకార్లు వినిపించాయి.

తాజాగా ఈ పుకార్లు పై రియాక్ట్ అయ్యారు కొరటాల శివ. ఎలాంటి సినిమాకైనా ఔట్ పుట్ బాగుండాలంటే రీషూట్ కూడా అవసరం అని, ఒకటి రెండు సన్నివేశాలు రీ షూట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు అని అన్నారు కొరటాల శివ."ఒక సన్నివేశం బాగాలేదని అనిపిస్తే, ఆ సన్నివేశాన్ని బాగా చేయటం కోసమే మనం రీషూట్ చేస్తాము. ఎందుకంటే చివరికి సినిమా తీసేది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయటం కోసం మాత్రమే.

వాళ్లు ఎంటర్టైన్ అవుతారు అనుకున్నప్పుడు ఒక సన్నివేశాన్ని రీషూట్ చేయటం తప్పేం కాదు" అని చెప్పిన కొరటాల శివ సినిమా "ఆచార్య" సినిమా కోసం కూడా కొన్ని సీన్లు రీషూట్ చేసినట్లు తెలిపారు. ఇక ఈ సినిమాని నిర్మిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ లు గా కనిపించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story