Koratala Siva - Allu Arjun: బన్నీ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన కొరటాల

Koratala Siva-Allu Arjun: పుష్ప తర్వాత బన్నీతో సినిమా చేస్తా అంటున్న కొరటాల శివ

admin1
Published on: 15 Dec 2021 10:36 AM IST
Koratala Siva is Going to do a Movie with Allu Arjun
X

పుష్ప తర్వాత బన్నీతో సినిమా చేస్తా అంటున్న కొరటాల(ఫైల్-ఫోటో)

Koratala Siva-Allu Arjun: ఈ ఏడాది ఏప్రిల్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఒక సినిమా దర్శకత్వం వహిస్తున్నట్లు ఒక పోస్టర్ విడుదల అయింది. దీంతో ఎట్టకేలకు కొరటాల అల్లు అర్జున్ కాంబినేషన్ రాబోతోందని అభిమానులు సంతోషించారు.

కానీ ఒక వైపు అల్లు అర్జున్ పుష్ప తో బిజీ అయి ఉండగా మరో వైపు కొరటాల శివ తన తదుపరి సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నరని ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ సినిమాని వాయిదా వేశారని అభిమానులు కొరటాల ను తెగ ట్రొల్ చేశారు. అయితే తాజాగా "పుష్ప" ముఖ్య అతిథిగా విచ్చేసిన కొరటాల అభిమానులకి ఒక సర్ప్రైజ్ ఇచ్చారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ పుష్ప రెండవ పార్ట్ కూడా పూర్తి అయిన తర్వాత బన్నీతో సినిమా చేస్తానని ఈలోపల ఎన్టీఆర్ తో సినిమా కూడా పూర్తి చేస్తానని కొరటాల శివ క్లియర్ గా చెప్పారు. కానీ అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉంది.

మరి పుష్పా 2 తర్వాత బోయపాటి తో సినిమా చేస్తారా లేక కొరటాల తో సినిమా చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. చాలావరకు కొరటాల శివ సినిమాల లో మాస్ ఎలిమెంట్స్ ను మాత్రమే కాక కొన్ని సోషల్ ఇష్యూస్ కూడా చూపిస్తారు. బన్నీ ఇలాంటి సోషల్ ఎలిమెంట్లు ఉన్న సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. దీంతో కొరటాల తో బన్నీ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

admin1

admin1

Next Story