ఆచార్య స్క్రిప్ట్ విషయంలో నిరాశ చెందిన కొరటాల శివ ?

Acharya: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల కూడా ఒకరు.

Arun Chilukuri
Updated on: 23 April 2022 8:00 PM IST
Koratala Siva Disappointed Over Acharya Script
X

ఆచార్య స్క్రిప్ట్ విషయంలో నిరాశ చెందిన కొరటాల శివ ?

Acharya: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల కూడా ఒకరు. ఇప్పటి దాకా తన కెరియర్లో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశారు కొరటాల శివ. కానీ ఆ నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారాయి. ఏదో ఒక సోషల్ మెసేజ్తో ఉండే కొరటాల సినిమాలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బెడిసికొట్టింది లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం కొరటాల శివ తదుపరి సినిమా అయిన "ఆచార్య" నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తున్నట్లుగా కొందరు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విషయంలో చిరంజీవి కూడా తలదూర్చి చాలా మార్పులు చేశారట.

మొదట్లో అనుకున్న స్క్రిప్టు ఇప్పటి స్క్రిప్ట్ రెండూ విభిన్నంగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అయితే చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో అన్ని మార్పులు చెప్పటం కొరటాల కి నచ్చలేదని కానీ చేసేది లేక కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేశారని తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే కొరటాల శివ ఈ పుకార్లపై రియాక్ట్ అయి అందులో నిజం లేదని తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ వాయిదాలు పడుతూనే ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు పూజాహెగ్డే లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29 న థియేటర్లలో విడుదల కాబోతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story