Koratala Siva - NTR30: 'ఎన్టీఆర్30' పై కొరటాల క్లారిటీ ...

Koratala Siva - NTR30: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్...

Shireesha
Updated on: 28 April 2022 3:29 PM IST
Koratala Siva Clarity about NTR30 Movie | Tollywood Gossips
X

Koratala Siva - NTR30: 'ఎన్టీఆర్30' పై కొరటాల క్లారిటీ ...

Koratala Siva - NTR30: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక కొరటాల దర్శకత్వం వహించిన "ఆచార్య" సినిమా ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కొరటాల సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడుతున్న కొరటాల శివ "ఎన్టీఆర్ కూడా సినిమా ఎప్పుడు చేద్దాం అని తనను ఇబ్బంది పెట్టడం లేదు కానీ ఆచార్య విడుదల అయిపోయాక మాత్రం తనను కిడ్నాప్ చేసేస్తాను" అని అంటున్నట్లు గా తెలిపారు ఆచార్య సినిమా విడుదలైన వారం పది రోజుల తర్వాత #ఎన్టీఆర్30 సినిమాకి సంబంధించిన అన్ని వార్తలు క్లియర్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు కొరటాల.

అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న ను హీరోయిన్గా ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఈ సినిమా గురించి క్లారిటీ రావాలంటే ఆచార్య సినిమా విడుదల అవ్వాలని చెప్పుకోవచ్చు.

Shireesha

Shireesha

Next Story