సినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?

Acharya: ఇప్పటిదాకా తన కెరియర్లో కేవలం ఇద్దరు సినిమాటోగ్రాఫర్ లతోనే కొరటాల శివ పనిచేశారు...

Shireesha
Updated on: 23 May 2022 1:36 PM IST
Koratala Siva Cinematographer Fight are Reason for Acharya Flop | Tollywood Gossips
X

సినిమాటోగ్రాఫర్ తో కొరటాల గొడవలే సినిమా ఫ్లాప్ కి కారణమా..?

Acharya: ఆచార్య సినిమా డిజాస్టర్ అయిన తర్వాత దాని గురించిన కారణాలు మాట్లాడుతూ కొందరు నెటిజన్లు కొరటాల శివ కి మరియు చిత్ర సినిమాటోగ్రాఫర్ కి అయిన గొడవల కారణంగానే ఈ సినిమా అవుట్ పుట్ అలా వచ్చిందని హీరో ఎలివేషన్ సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్ గురించి సినిమాటోగ్రాఫర్ కొరటాల శివ కి ఎటువంటి ఇన్ పుట్స్ ఇవ్వకపోవడంతో ఇలా జరిగిందని కొందరు కామెంట్లు చేశారు.

ఇప్పటిదాకా తన కెరియర్లో కేవలం ఇద్దరు సినిమాటోగ్రాఫర్ లతోనే కొరటాలశివ పనిచేశారు. ఇక ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న తిరు తో కొరటాల శివకి గొడవ జరిగిందని వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు కొరటాల శివ తన తదుపరి సినిమా కోసం కొత్త సినిమాటోగ్రాఫర్ ని ఎంపిక చేసుకోవడంతో ఈ వార్తల్లో నిజం ఉందని తెలుస్తోంది.

కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ఈ సినిమా కోసం రోబో మరియు ఆర్య ఫేమ్ రత్నవేలు ను సినిమాటోగ్రాఫర్గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటి దాకా దేవిశ్రీప్రసాద్ తోనే సినిమాలు చేసిన కొరటాల ఈ సినిమా కోసం సంగీతం ని అందించడానికి అనిరుద్ రవిచందర్ ని రంగంలోకి దింపారు. అలాగే కాస్ట్యూమ్స్ మరియు ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ కి ఇచ్చారు కొరటాల శివ. మరి ఇన్ని మార్పులు చేశాకైనా కొరటాల హిట్ అందుకుంటారో లేదో చూడాలి.


Shireesha

Shireesha

Next Story