వరంగల్ శ్రీను కి హామీ ఇచ్చిన కొరటాల శివ

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైంది.

Arun Chilukuri
Published on: 2 May 2022 4:37 PM IST
Koratala Siva Assures Help to Warangal Srinu
X

వరంగల్ శ్రీను కి హామీ ఇచ్చిన కొరటాల శివ

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 29న థియేటర్లలో విడుదలైంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మొట్టమొదటిసారిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది కానీ చూస్తూ ఉంటే సినిమా కలెక్షన్లు కనీసం బ్రేక్ ఈవెన్ పాయింట్ ను కూడా చేరుకునేలా గా కనిపించడం లేదు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఈ సినిమాని నైజాం ప్రాంతంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. నిజానికి నైజాం ఏరియా లో సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం వరంగల్ శీను నిర్మాతలకు భారీ మొత్తాన్ని చెల్లించారు. కానీ సినిమా ఇప్పుడు డిజాస్టర్గా నిలవడంతో వరంగల్ శీను కి భారీ నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో చిత్ర డైరెక్టర్ కొరటాల శివ ముందుకు వచ్చి వరంగల్ శ్రీను ని కంగారు పడవద్దని తన తదుపరి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తో కొంత పరిహారం చెల్లిస్తానని చెప్పడంతో వరంగల్ శీను మళ్ళీ ఊపిరిపీల్చుకున్నారట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story