Vijay - Koratala: బన్నీ కథను విజయ్ దేవరకొండకు వినిపించిన కొరటాల

Koratala Shiva Village Love Story Narrated to Vijay Devarakonda After Bunny Rejected The Same Story
x

కొరటాల శివ - విజయ్ దేవరకొండ (ఫైల్ ఫోటో)

Highlights

Vijay Deverakonda-Koratala Shiva : ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకులలో కొరటాల శివ కూడా ఒకరు. చేసినవి నాలుగు సినిమాలే అయినప్పటికీ అన్నీ బ్లాక్...

Vijay Deverakonda-Koratala Shiva : ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకులలో కొరటాల శివ కూడా ఒకరు. చేసినవి నాలుగు సినిమాలే అయినప్పటికీ అన్నీ బ్లాక్ బస్టర్ లే. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు కొరటాల. ఈ సినిమా పూర్తయిన తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. "జనతా గ్యారేజ్" సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో అది రెండవ సినిమా కాబోతోంది అని అందరూ అనుకున్నారు కానీ ఆ సినిమాను అటకెక్కించి కొరటాల శివ అల్లు అర్జున్ తో ఒక సినిమాని ప్రకటించేశారు.

అల్లు అర్జున్ తో సినిమా చేసిన తర్వాతే ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. అయితే ఈ మధ్యనే కొరటాల శివ అల్లు అర్జున్ కు పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక మంచి ప్రేమ కథ ను వినిపించారట. కానీ అల్లుఅర్జున్ కి ఆ కథను నచ్చలేదట. ఇప్పుడు అదే కథను కొరటాల శివ విజయ్ దేవరకొండకు నేరేట్ చేయగా, "వరల్డ్ ఫేమస్ లవర్" హీరో కి ఈ కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. బన్నీ, ఎన్టీఆర్ లతో సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత కొరటాల శివ విజయ్ దేవరకొండ హీరోగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories