ఆచార్య ఎఫెక్ట్‌: కొర‌టాల, చిరు ఎన్ని కోట్లు వెన‌క్కి ఇచ్చారంటే...!

Koratala Shiva: *ఆచార్య వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు అభయ హస్తాన్ని చూపించిన కొరటాల

Sriveni Erugu
Published on: 15 May 2022 3:09 PM IST
Koratala Shiva Help to The Distributors
X

డిస్ట్రిబ్యూటర్లకు తనవంతు సహాయాన్ని అందించిన కొరటాల శివ

Koratala Shiva: వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో కెరీర్ ముందుకు దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమా మెగా అభిమానులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తమ వంతు సహాయాన్ని అందించడానికి ముందుకు వచ్చారు డైరెక్టర్ కొరటాల శివ.

తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ నష్టనివారణ చర్యల్లో భాగంగా పాతిక కోట్ల దాకా తిరిగి డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానకి కొరటాల శివ ఈ సినిమా కోసం అన్ని తానై నడిపించారు. సినిమా అమ్మకాల విషయంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు సినిమా వల్ల నష్టం వాటిల్లడంతో తన బాధ్యతగా పాతిక కోట్లు వెనక్కి తిరిగి ఇచ్చేశారు. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఒక డైరెక్టర్ ఇంత పెద్ద మొత్తాన్ని వెనక్కి తిరిగి చేయటం టాలీవుడ్లో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. మరోవైపు మెగాస్టార్ కూడా తనవంతు సహాయంగా 10 కోట్లను తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story