Koratala Siva: ఎన్టీఆర్ సినిమా పై దృష్టి పెట్టిన కొరటాల

Koratala Siva: ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ తో బిజీగా ఉన్న కొరటాల

admin1
Published on: 17 Nov 2021 1:46 PM IST
Koratala Shiva Busy With NTR Movie Script
X

ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ లో బిజీగా ఉన్న కొరటాల శివ (ఫైల్ ఇమేజ్)

Koratala Siva: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన "భరత్ అనే నేను" సినిమా తో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను కొరటాల శివ పూర్తి చేసారట. "ఆచార్య" ఫైనల్ కాఫీ కూడా పూర్తయిపోయింది. సినిమా విడుదల కూడా ఫిబ్రవరి లో కాబోతోంది కాబట్టి కొరటాల శివ ఇప్పుడు తన తదుపరి సినిమా మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాడట.

కొరటాల త్వరలోనే ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ వచ్చే ఏడాది దాకా సినిమా షూటింగ్ లలో పాల్గొనటానికి ఆసక్తి చూపించడం లేదు. కాబట్టి ప్రస్తుతం స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్నారు కొరటాల. ఈ నేపథ్యంలో శివ మరియు రైటర్ శ్రీధర్ సీపాన తదితరులతో కలిసి ఈ సినిమా స్క్రిప్ట్ కి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నారట. జనవరి నాటికి ఈ సినిమా కోసం కొన్ని ఆసక్తి కరమైన సన్నివేశాలను రాయాలని కొరటాల శివ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరిలో "ఆచార్య" ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు కొరటాల శివ. ఇక "ఆచార్య" సినిమా విడుదలైన తరువాత మళ్లీ ఎన్టీఆర్ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది దసరాకి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

admin1

admin1

Next Story