ఈసారి మెసేజ్ లేదు.. మాస్ మాత్రమే అంటున్న కొరటాల

మాస్ సినిమా తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కొరటాల

Rama Rao
Updated on: 18 May 2022 3:15 PM IST
Koratala Shiv Spoke About the Next film | Telugu News
X

ఈసారి మెసేజ్ లేదు మాస్ అని మాత్రమే అంటున్నా కొరటాల

Koratala Siva: ఇప్పటిదాకా కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించిన "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ ను అందుకున్నారు. ఇక ప్రస్తుతం కొరటాల శివ తదుపరి సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. నిజానికి కొరటాల శివ ఎన్టీఆర్ తో ఒక పొలిటికల్ సినిమా చేయాలని అనుకున్నారు.

అందులో ఎన్టీఆర్ ని ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్ పాత్రలో చూపించాలని అనుకున్నారు. ఇంతకుముందు సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా సోషల్ మెసేజ్ ఉంటుందేమోనని అభిమానులు అనుకున్నారు. అయితే "ఆర్ఆర్ఆర్", "కేజిఎఫ్" వంటి సినిమాలు చూసిన కొరటాల శివ ఎంటర్టైన్మెంట్ కి ఈ సినిమాలో పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాలో కూడా మాస్ ఎలిమెంట్లు, ఎలివేషన్లు అదిరిపోయే డైలాగులతో సినిమా తీయాలని అనుకుంటున్నారట.

ఈసారి ఈ సినిమాతో ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అని తన అసిస్టెంట్లు అడిగితే కొరటాలశివ "ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా మాస్ అంతే" అని చెబుతున్నారట. ఇక జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాతో కొరటాల ఎంత వరకు మెప్పిస్తారో వేచి చూడాలి.

Rama Rao

Rama Rao

Next Story