Koratala - Bunny: వీళ్ల కాంబో అందుకే సెట్ అవ్వలేదా?

Allu Arjun: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నాడు.

Venkata Chari
Updated on: 5 Jun 2021 7:45 PM IST
Koratal Shiva and Allu Arjun Combo is Not Set
X

కొరటాల శివ, అల్లు అర్జున్ (ఫొటో ట్విట్టర్)

Allu Arjun: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నాడు. కరోనాతో ఈ సినిమా ఫైనల్ షూటింగ్ వాయిదా పడింది. కాగా, ఈ సినిమా తరువాత అల్లు అర్జున్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేయాల్సింది. దీనిపై కసరత్తులు కూడా పూర్తిచేశాడంట కొరటాల. కానీ, కారణం ఏంటో తెలియదు... జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను ప్రకటించి ఆశ్చర్యపరిచాడు కొరటాల.

అల్లు అర్జున్‌తో సినిమా ఉంటుందని ఫ్యాన్స్‌ ఊహించారు. కానీ, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తుండడంతో.. బన్నీ ఫ్యాన్స్ ఒకింత షాక్‌ కి గురయ్యారంట. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ కొరటాల.. అల్లు అర్జున్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ప్లాన్ చేశాడంట.

కానీ, ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాకే కొరటాల సినిమా చేయాల్సి ఉంది. అయితే 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా తీస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ రెండు భాగాలు పూర్తయ్యే వరకు బిజీగా ఉండనునన్నాడు. అప్పటి వరకు ఆగడం దేనికని జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాను ప్రకటించాడంట కొరటాల. అదే కథను ఎన్టీఆర్ కి వినిపించి ఓకే అనిపించుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

Venkata Chari

Venkata Chari

Next Story