ఆసియాలోనే ది బెస్ట్‌ హోటల్‌ లో నిహరిక పెళ్లి!

ఆసియాలోనే ది బెస్ట్‌ హోటల్‌ లో నిహరిక పెళ్లి!
x
Highlights

ఇక ఇప్పటికే నిహారిక-చైతన్య వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ కోసం ఉదయ్ ‌విలాస్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

డిసెంబర్ తొమ్మిదిన జరగబోయే కొణిదెల నిహరిక, చైతన్య జొన్నలగడ్డ వివాహానికి వేదిక ఫిక్స్ అయింది. ఉదయ్ పూర్ లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో వీరి వివాహం జరుగుతుంది. కొణిదెల వారి ఇంట్లో చాలా రోజుల తరవాత జరుగుతున్న వివాహం కావడంతో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా ఉండేలా చూస్తున్నారు. అందుకే ఆసియాలోనే ది బెస్ట్‌ హోటల్‌గా, ప్రపంచం లోనే టాప్ 5 హోటల్ గా గుర్తింపు పొందిన ఉదయ్ విలాస్ హోటల్ ను వివాహ వేదికని ఫిక్స్ చేశారు.

ఇక ఇప్పటికే నిహారిక-చైతన్య వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ కోసం ఉదయ్ ‌విలాస్‌ ప్యాలెస్‌కు చేరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇక ఇదే హోటల్ లో అంతకుముందు ముఖేశ్‌ అంబానీ గారాల పట్టి ఈశా సంగీత్‌ వేడుక జరిగింది.

మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక‌.. ఒక మ‌న‌సు,హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని సమాచారం.. దీనితో పాటుగా తమిళ్ లో ఓ సినిమాలో నటిస్తుంది నిహారిక..

Show Full Article
Print Article
Next Story
More Stories