Niharika Konidela: పెళ్లయ్యాక నిహారిక మొదటి వెబ్ సిరీస్.. అనసూయతో కలిసి భారీ ప్లాన్

మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గత ఏడాది చైతన్య జొన్నలగడ్డను పరిణయం ఆడిన సంగతి తెలిసిందే.

Samba Siva Rao
Published on: 8 Jan 2021 5:39 PM IST
Niharika Konidela: పెళ్లయ్యాక నిహారిక మొదటి వెబ్ సిరీస్.. అనసూయతో కలిసి భారీ ప్లాన్
X

మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గత ఏడాది చైతన్య జొన్నలగడ్డను పరిణయం ఆడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత నిహారిక సినిమాల్లో నటిస్తుందా? లేదా? అనే సందేహాలు అభిమానులకు కలిగాయి. వాటికి జవాబు ఇచ్చేసింది నిహారిక. అందులో భాగంగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించడానికి రెడీ అయిపోయింది. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌ను షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. లాంఛంగా ఈ వెబ్‌ సిరీస్‌ ప్రారంభమైంది.

రాయుడు చిత్రాలు అనే బ్యానర్‌పై భాను రాయుడు ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. నిహారిక కొణిదెల నటిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. యూట్యూబర్‌గా మంచి పేరున్న నిఖిల్‌ విజయేంద్ర నటిస్తున్నాడు. కీరవాణి సోదరుడు కల్యాణ్‌ మాలిక్‌ ఈ వెబ్‌ సిరీస్‌కు సంగీత సారథ్యం వహిస్తున్నారు.

కాగా... నిహారికకు వెబ్‌ సిరీస్‌ల్లో నటించడం కొత్తేమీ కాదు. ముద్దపప్పు అవకాయ్‌, నాన్న కూచి, మ్యాడ్‌ హౌస్‌ వెబ్‌ సిరీస్‌లకు అందులో నటించింది ఈ సిరీస్ కు తానే నిర్మాతగా వ్యవహరిస్తూ వచ్చింది. నిహారిక ఒక వైపు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తూనే సినిమాల్లోనూ నటించింది. నిహారిక నటించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పెళ్లి తర్వాత నిహారిక నటిస్తున్నతొలి వెబ్ సిరీస్ కావడంతో తన లక్ మరుతోందో లేదో చూడాలి.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story