నేను పవన్ గురించి చెప్పింది వాళ్ళు రాయలేదు

Ruthvik
Published on: 26 March 2019 12:52 PM IST
నేను పవన్ గురించి చెప్పింది వాళ్ళు రాయలేదు
X

ఒక వైవు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రచార పర్వం జోరుగా సాగుతుంటే, లీడర్లు అందరూ ఒకళ్ళ పై ఒకళ్ళు విమర్శలు బాగానే గుప్పించుకుంటున్నారు. అయితే మధ్య మధ్య లో కొందరు సినీ ప్రముఖులు కూడా కామెంట్స్ చేసి అనవసరం గా ఇరుక్కుంటున్నారు. తాజాగా కోన వెంకట్ ఓ పేపర్ కి ఇఛ్చిన ఇంటర్వ్యూ పవన్ ఫాన్స్ ని నిరాశ కి గురి చేసింది. పవన్ ఫాన్స్ అంతా ఇప్పుడు కోన వెంకట్ వి డబుల్ స్టాన్దర్డ్స్ అంటున్న నేపథ్యం లో ఆయన ఈ రోజు ప్రెస్ రిలీజ్ ఇచ్చ్చారు. " పేపర్ లో నేను పవన్ గురించి కూడా మాట్లాడాను. పవన్ మంచి కోరే వాళ్లలో నేను ముందు ఉంటాను. ఈ విషయం చెప్పాను కానీ వాళ్ళు రాయలేదు. మూడు దశాబ్దాల తర్వాత మా కుటుంబాన్ని ఆదరించింది జగన్ గారు. అందుకే ఆయన కి ప్రచారం చేస్తున్నాను. నా పర్సనల్ లాయల్టీ వేరు ఉంటుంది, నా పొలిటికల్ లాయల్టీ వేరు ఉంటుంది. నేను జనసేన స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ ఇఛ్చినప్పుడు నా పై వైస్సార్సీపీ వాళ్ళు విమర్శలు చేశారు కానీ నేను అవి పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు ఆయన టీఆరెస్ పై చేస్తున్న కామెంట్స్ చేస్తుంటే ఆయన్ని ఎవరో తప్పుగా గైడ్ చేస్తున్నట్టు అనిపించింది అని అన్నాను." అని కోన తన స్టేట్మెంట్ లో చెప్పాడు.

Ruthvik

Ruthvik

Next Story