RRR Movie: కొమురం భీముడో ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Komuram Bheemudo Full Video Song Released
x

RRR Movie: కొమురం భీముడో ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

Highlights

Komuram Bheemudo Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన మల్టీస్టారర్ ఇండియన్ సినిమా "ఆర్ ఆర్ ఆర్".

Komuram Bheemudo Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన మల్టీస్టారర్ ఇండియన్ సినిమా "ఆర్ ఆర్ ఆర్". బాహుబలి సినిమా తరువాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించారు. ఈ సినిమా మార్చ్ 31న థియేటర్లలో విడుదలైంది. అంచనాలకు మించి ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో రికార్డుల వర్షం కురిపించింది.

ఎమ్ఎమ్ కీర‌వాణి స్వ‌ర ప‌రిచిన బాణీలు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. సినిమా విడుద‌ల‌కు ముందే ఈ పాటలు యూట్యూబ్‌లో మిలియ‌న్ల వ్యూస్‌ను సాధించాయి. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని 'దోస్తీ', 'నాటునాటు', 'కొమ్మ ఉయ్యాల' వీడియో సాంగ్స్ విడుద‌ల‌వ‌గా ప్రేక్ష‌కుల నుంచి విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ క్ర‌మంలో తాజాగా మేక‌ర్స్ 'కొమురం భీముడో' వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు. సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్‌ తూటాల్లా పేలగా కాల భైరవ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories