మరో రికార్డు బద్దలు కొట్టిన RRR

మరో రికార్డు బద్దలు కొట్టిన RRR
x
Highlights

ఇక ఇదిలా ఉంటే కొమురం భీం జ‌యంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కొమరం భీమ్ టీజ‌ర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ టీజర్ కి ఇప్పటివరకు రెండు లక్షలకి పైగా కామెంట్లను దక్కించుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు.. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే కొమురం భీం జ‌యంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కొమరం భీమ్ టీజ‌ర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ టీజర్ కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ టీజర్ కి ఇప్పటివరకు రెండు లక్షలకి పైగా కామెంట్లను దక్కించుకుంది. ఈ స్థాయిలో కామెంట్లు వచ్చిన టీజర్ టాలీవుడ్ లోనే ఇదే మొదటిది కావడం విశేషం. ఇక ఇప్పటివరకు ఈ టీజర్ కు మూడు కోట్ల ఇరువై ఆరు లక్షల వ్యూస్ రాగా, 11 లక్షలకి పైగా లైక్స్ వచ్చాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడం, బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తరవాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక అజయ్ దేవగన్, శ్రియ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories