Komaram Bheem Poster: ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ న్యూలుక్ తో ఫ్యాన్స్ పండగ

Komaram Bheem Poster: యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సూపర్ డూపర్ గిఫ్ట్ ను రాజమౌళి అందించారు.

Kranthi
Updated on: 20 May 2021 11:51 AM IST
Komaram Bheem Poster
X

Komaram Bheem Poster

Komaram Bheem Poster: జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేను ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో జరుపుకుంటున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు సూపర్ డూపర్ గిఫ్ట్ ను రాజమౌళి అందించారు. ఆర్ఆర్ఆర్ మూవీలోని తారక్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆ లుక్ అదిరిపోయింది. ఎంతలా అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎగిరి గంతులేసేంతగా.

సముద్రం నుంచి ఉవ్వెత్తున ఎగసిపడ్డ కెరటంలా గాల్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. చేతిలో శూలాన్ని రౌద్రంగా గురిపెట్టి విసురుతున్న ఆ లుక్ నిజంగా అదుర్స్. అందుకే తారక్ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు.

వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ.. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీమ్.. అంటూ రామ్ చరణ్ బేస్ వాయిస్ తో పరిచయం అయిన ఆ కొమురం భీమ్.. ఈసారి ఇలా దర్శనమిచ్చాడు.

ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇప్పటికే చివరి దశలో ఉంది. కరోనా లేకుండా ఈ పాటికి అయిపోయేదే. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రెస్టేజియేస్ పాన్ ఇండియా మూవీ కోసం అభిమానులు కోటి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్, మరో ముఖ్య పాత్రలో అజయ్ దేవగన్, హీరోయిన్లుగా అలియాభట్, ఒలివియా మోరిస్‌ నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ మొదట అక్టోబర్ 13గా నిర్ణయించి.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. రీషెడ్యూల్ చేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది.



Kranthi

Kranthi

Next Story