Saranga Dariya Song:ముదురుతున్న వివాదం..సుద్దాల మాట మార్చారంటు కోమలి కన్నీళ్లు

Saranga Dariya song controversy: యూట్యూబ్‌లో వచ్చే జానపదాలకే ఈ తరం ప్రేక్షకులు జై కొడుతున్నారు.

Samba Siva Rao
Published on: 7 March 2021 5:26 PM IST
Saranga Dariya Song:ముదురుతున్న వివాదం..సుద్దాల మాట మార్చారంటు కోమలి కన్నీళ్లు
X

సారంగ దరియా  పాట వివాదం

Saranga Dariya song controversy: సినిమాలో వచ్చే మాస్‌ సాంగ్స్‌ కన్నా యూట్యూబ్‌లో వచ్చే జానపదాలకే ఈ తరం ప్రేక్షకులు జై కొడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు పాటలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా..' పాట మీద వివాదాలు కొనసాగుతునే ఉన్నాయి. గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఈ పాటను రాశారని చిత్రయూనిట్ చేసిన ప్రకటనపై కోమలి అనే అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన కోమలి 'సారంగ దరియా..' పాట తనదే అంటూ చెప్పుకొచ్చింది.

ఈ పల్లెల్లో పాటను తానే వెలుగులోకి తెచ్చానని కోమలి చెబుతుంది. 'రేలా రే' ప్రోగ్రాంలో మొదటిసారి ఈ 'సారంగ దరియా' జానపదాన్ని పాడి వినిపించానని చెప్పింది. ఆ సమయంలో సుద్దాల అశోక్ తేజ తన పాటను విన్నారని ఆమె గుర్తుచేశారు.

దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ పాటను పాడాలని తనను కోరినట్లు తెలిపింది. ఆ సమయంలో తన గొంతు బాగాలేదని, 10 రోజలు గడువు ఇవ్వాలని కమ్ములని కోరినట్లు వెల్లడించింది. అయితే శేఖర్ కమ్ముల అంత సమయం లేదని ఆడియో వేడుకలో పాడాలని పాడిస్తాం. అలాగే అశోక్ తేజ గారి పక్కనే నీ పేరు కూడా వేస్తాం అని చెప్పారని ఆమె వెల్లడించారు. సినిమాలో ఛాన్స్ ఇస్తామని కమ్ముల అన్నారని కోమలి స్ఫష్టం చేసింది. ఇప్పుడు చిత్రయూనిట్ మాట మార్చిందని, తాను కోరుకునేది తన పేరు కూడా చిత్రంలో వేయాలని కోమలి అభ్యర్థించింది. కాగా సుద్దాల అశోక్‌ తేజ సైతం ఈ పాట సేకరించింది కోమలి అని అంగీకరించాడు.

'సారంగ దరియా..' సాంగ్ లవ్‌ స్టోరీ సినిమాలో సూపర్‌ డూపర్‌ హిట్టైంది. సాంగ్ రిలీజ్ అయిన కొద్దీ రోజుల్లోనే భారీగా వ్యూస్ సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుంది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సంగీతం సమకూర్చారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story