Pushpa: అల్లు అర్జున్ సినిమాలో కోలీవుడ్ స్టార్

Pushpa: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే 'పుష్ప' చిత్రంపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.

Venkata Chari
Published on: 27 March 2021 4:06 PM IST
Kollywood star actor on board for Pushpa
X

పుష్ప సినిమాలో మలయాళ  స్టార్ హీరో ఫహద్ ఫాసిల్

Pushpa: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రంపై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. బన్నీ, సుకుమార్‌ల కలయికతో వచ్చిన ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్‌లుగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ చూపు ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబో లో వచ్చే పుష్ప సినిమాపైనే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా స్థాయిని పెంచేందుకు ఇతర భాషల్లోని ప్రముక యాక్టర్స్ ను పుష్ప మూవీలో జాయిన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమాలో ఇప్పటికే కోలీవుడ్ స్టార్ సముతిరాకని కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సముతిరాకని, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన అల వైకుంఠాపురంలో సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప సినిమాలో సముతిరాకణి మరోసారి అల్లు అర్జున్ తో నటించనున్నారు.

అలాగే, ఈ సినిమాలో మెయిన్ విలన్ గా మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ లైన్ లో ఉన్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. ఈమేరకు మేకర్స్ మలయాళ స్టార్ ను సంప్రదించి, కథను కూడా వినిపించారని టాక్. అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుందని సమాచారం.

Venkata Chari

Venkata Chari

Next Story