ప్రముఖ నటుడు రామస్వామి విశ్వనాధన్ కన్నుమూత

ప్రముఖ నటుడు రామస్వామి విశ్వనాధన్ కన్నుమూత
x
Ramaswamy Viswanathan (file Photo)
Highlights

ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్ (విసు, 72).

ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్ (విసు, 72)అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. విసు 1945 జులై 1న తమిళనాడులో జన్మించారు. కెరీర్ మొదట్లో అయన ప్రముఖ దర్శకుడు కే. బాలచందర్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని మొదలి పెట్టారు. అయితే 1981లో తమిళంలో వచ్చిన 'కుటుంబం ఒరు కదంబం'అనే చిత్రంతో నటుడుగా వెండితెరకు పరిచయం అయ్యారు.

ఈ చిత్రానికి ఆయనే కథను అందించటం విశేషం, అంతే కాకుండా పలు చిత్రాలకు కథలను అందించారు. 'కణ్మని పూంగ'అనే చిత్రంతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తమిళ సినీ తెరపై దర్శకుడుగా, రచయితగా, నటుడుగా, నిర్మాత గా, ఇలా అన్ని రంగాల్లో తనకంటూ ఓక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. విసు 2016లో బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. అయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories