Allegations against Hero Vishal: విశాల్ సీక్రెట్స్ బయటపెడతా!

Allegations against Hero Vishal: యంగ్ హీరో విశాల్ గత కొంతకాలంగా ఆదాయపు శాఖకు చెల్లిచాల్సిన డీఎస్ ని చెల్లించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Krishna
Published on: 7 July 2020 12:15 PM IST
Allegations against Hero Vishal: విశాల్ సీక్రెట్స్ బయటపెడతా!
X
Vishal (File Photo)

Allegations against Hero Vishal: యంగ్ హీరో విశాల్ గత కొంతకాలంగా ఆదాయపు శాఖకు చెల్లిచాల్సిన డీఎస్ ని చెల్లించడం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా తన ఆఫీస్ లో అకౌంటెంట్‌గా పనిచేసే రమ్య రూ.45 లక్షలు మోసం చేసిన‌ట్టు తేలిందని, ఆమె పై విశాల్ మేనేజర్ హరి స్థానిక సాలిగ్రామంలోని పోలీస్‌ స్టేషన్లో ఈ వ్యవహారంపై పిర్యాదు చేశాడు...ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన డబ్బులను తన వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌లోకి ఆమె బదిలీ చేసినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో తనపై ఫిర్యాదు చేయ‌డంతో ర‌మ్య ఓ ఛానల్ ద్వారా హీరో విశాల్ పైన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది...

విశాల్ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి టీడీయస్‌ను చెల్లించకుండా మోసానికి పాల్పడుతున్నారని, దాని నుంచి తప్పిచుకోవడానికే తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా విశాల్ మేనేజర్ హరి వర్గం తన ఇంటికి వచ్చిబెదిరించారని ఆరోపించింది. ఇక బయటకు హీరోగా కనిపించే విశాల్ పెద్ద విలన్ అంటూ వాఖ్యలు చేసింది. వారు చేసే విషయాలు తనకి తెలుసునని, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసిన ఆమె, మహిళను కావడం వల్లే తనను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం వారి నుండి నాకు ప్ర‌మాదం పొంచి ఉందని, త‌న‌కి పోలీసులు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరింది ర‌మ్య‌.

ఇటు విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో 'చక్ర' అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన జెర్సీ ఫేం శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రెజీనా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారిగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేయగా విశేషమైన స్పందన వస్తుంది. ఎం.ఎస్‌. ఆనందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమాని ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.


Krishna

Krishna

Next Story