Hero Vishal Official Notice to Ramya: ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. VFC అఫీషియల్ స్టేట్‌మెంట్

Hero Vishal Official Notice to Ramya: గత కొద్దిరోజులుగా తమిళ్ హీరో విశాల్, అతని కంపెనీ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో పనిచేసే రమ్య మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే..

Krishna
Updated on: 17 July 2020 2:56 PM IST
Hero Vishal Official Notice to Ramya: ఆమెతో మాకు ఎలాంటి సంబంధం లేదు.. VFC అఫీషియల్ స్టేట్‌మెంట్
X
Vishal (File Photo)

Hero Vishal Official Notice to Ramya: గత కొద్దిరోజులుగా తమిళ్ హీరో విశాల్, అతని కంపెనీ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీలో పనిచేసే రమ్య మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.. తమ కంపెనీలో గత కోనేళ్ళుగా డబ్బు మాయమవుతోందని, అయితే ఆ డబ్బును అకౌంటెంట్ గా పనిచేసే రమ్య అనే వ్యక్తి దాదాపుగా 45 లక్షలు కజేసినట్టుగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ యాజమాన్యం చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. దీనితో కోలివుడ్ లో ఇది పెద్ద సంచలనానికి దారితీసింది.

అయితే దీనిపైన రమ్య ఓ మీడియా ఛానల్ లో మాట్లాడుతూ.. తానూ ఎలాంటి మోసం చేయలేదని, కావాలనే తనని ఇరికించాలని చూస్తున్నారని పేర్కొంది. అంతేకాకుండా సరిగ్గా ట్యాక్స్‌లు కట్టకుండా వాటి నుంచి తప్పించుకునేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించింది. అంతేకాకుండా విశాల్ మేనేజర్ హరి వర్గం తన ఇంటికి వచ్చి బెదిరించారని ఆరోపించింది. ఇక బయటకు హీరోగా కనిపించే విశాల్ పెద్ద విలన్ అంటూ వాఖ్యలు చేసింది. వారు చేసే విషయాలు తనకి తెలుసునని, సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానని రమ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

అయితే తాజాగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ అఫీషియల్ గా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తమ కంపెనీలో చాలా ఏళ్లుగా చీఫ్ అకౌంటెంట్‌గా చేస్తున్న రమ్యకి మా కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. ఆమెతో ఎవరైనా, ఏదైనా ఆర్థిక కార్యకలాపాలు జరిపి ఉంటే దానికి మీరే బాధ్యులు అంటూ అ ప్రెస్ నోట్ లో పేర్కొంది.

ఇటు విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో 'చక్ర' అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన జెర్సీ ఫేం శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రెజీనా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారిగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేయగా విశేషమైన స్పందన వస్తుంది. ఎం.ఎస్‌. ఆనందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమాని ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.



Krishna

Krishna

Next Story