Hero Vishal: హీరో విశాల్ ను మోసం చేసిన యువతి.. కేసు నమోదు!

Hero Vishal: హీరో విశాల్.. తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా తన సినిమాలను రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

Krishna
Published on: 5 July 2020 8:00 PM IST
Hero Vishal: హీరో విశాల్ ను మోసం చేసిన యువతి.. కేసు నమోదు!
X
Vishal (File Photo)

Hero Vishal: హీరో విశాల్.. తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో కూడా తన సినిమాలను రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పందెంకోడి, పొగరు, భరణి, అభిమన్యుడు మొదలగు సినిమాలతో హీరోగా మెప్పించాడు విశాల్.. ఇక ఇది ఇలా ఉంటే విశాల్ ను ఓయువతి మోసం చేసింది. దీనితో ఆమె పై పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

విశాల్ కంపెనీ అయిన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లో పనిచేసే ఓ యువతి గత ఆరేళ్లలో రూ .45 లక్షలకు పైగా మోసం చేసి డబ్బు కూడపెట్టినట్టు తేలింది. ఆ డబ్బుతో సదరు యువతీ ఓ ఇల్లు కూడా కొనడం గమనార్హం. ఈ విషయం బయటకు రావడంతో ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్లో కేసు ఫిల్ చేశాడు. ఆదాయపు శాఖకు చెల్లించాల్సిన డబ్బులను తన వ్యక్తిగత బ్యాంక్‌ అకౌంట్‌లోకి ఆమె బదిలీ చేసినట్టుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపైన విచారణ జరుగుతుంది.

ఇటు విశాల్ ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో 'చక్ర' అనే సినిమాని రూపొందిస్తున్నాడు. ఇందులో విశాల్ సరసన జెర్సీ ఫేం శ్రద్ధాశ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక రెజీనా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాని తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారిగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ . తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేయగా విశేషమైన స్పందన వస్తుంది. ఎం.ఎస్‌. ఆనందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమాని ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.


Krishna

Krishna

Next Story