దర్శకుడు శివ ఇంట విషాదం!

తమిళ, తెలుగు దర్శకుడు శివ ఇంట విషాదం నెలకొంది. అయన తండ్రి జయకుమార్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు.

Krishna
Published on: 28 Nov 2020 6:32 PM IST
దర్శకుడు శివ ఇంట విషాదం!
X

తమిళ, తెలుగు దర్శకుడు శివ ఇంట విషాదం నెలకొంది. అయన తండ్రి జయకుమార్ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. అయితే అయన ఆరోగ్యం కుదటపడకపోవడంతో తుదిశ్వాస విడిచినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. జయకుమార్ కుమార్ కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. జయకుమార్‌కు పెద్ద కుమారుడే శివ.

మొదట సినిమాటోగ్రాఫర్‌గా సినీ ప్రయాణాన్నిమొదలుపెట్టారు శివ. తెలుగులో శ్రీరామ్, నేనున్నాను, గౌతమ్ ఎస్ఎస్‌సీ, బాస్ మొదలగు చిత్రాలకు అయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక ఆ తరవాత గోపీచంద్ హీరోగా వచ్చిన 'శౌర్యం' సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తరవాత శంఖం, దరువు సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే తెలుగులో ఆయనకి పెద్దగా పేరు రానప్పటికీ తమిళ్ లో మాత్రం స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నారు.

తమిళ్ లో కార్తి హీరోగా వచ్చిన సిరుతాయి సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శివ చేసిన మొదటి సినిమాతోనే అక్కడ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరవాత అజిత్‌తో వరుసగా 'వీరం', 'వేదాళం', 'వివేగం', 'విశ్వాసం' చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్‌తో 'అన్నాతే' సినిమాను చేస్తున్నారు శివ.

Krishna

Krishna

Next Story