Kollywood: డైరెక్టర్ శంకర్ ఇంట తీవ్ర విషాదం

Kollywood: ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట విషాదం నెల‌కొంది.

Samba Siva Rao
Published on: 18 May 2021 11:26 PM IST
Shankar Mother Muthulakshmi Passes Away
X

శంకర్ ఫైల్ ఫోటో 

Kollywood: ప్రముఖ దర్శకుడు శంకర్ ఇంట విషాదం నెల‌కొంది. శంక‌ర్ తల్లి ఎస్.ముత్తు లక్ష్మి (88)క‌న్నూశారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శంకర్ తల్లి మ‌ర‌ణ వార్త తెలియగానే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనను ఫోన్ లో పరామర్శిస్తున్నారు. కరోనా కారణంగా ఇంటికి రావొద్ద‌ని శంకర్ విజ్ఞప్తి చేసారని స‌మాచారం. ముత్తు లక్ష్మి అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి.

అంతేకాదు శంకర్ తన తల్లి ఆశీర్వాదంతోనే ఏ సినిమా మొద‌లు పెట్టేవాడని ఇండ‌స్ట్రీలో అంతా అంటున్నారు. 'ఒకే ఒక్కడు' 'జీన్స్' ప్రస్తుతం టాలీవుడ్ మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా.. రణవీర్ సింగ్ తో ఓ మూవీ కమిట్ అయ్యాడు. ఇక కమల్ హాసన్ తో తలపెట్టిన 'ఇండియన్ 2' సినిమా వివాదాల్లో నిలిచిన సంగ‌తి తెలిసిందే. 'జెంటిల్ మెన్' 'భారతీయుడు' 'అపరిచితుడు 'ఐ' 'రోబో' తదితర చిత్రాలతో శంకర్ తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story