Kollywood: అట్లీతో అట్లుంది మరి.. బన్నీ సినిమా రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Kollywood: అట్లీతో అట్లుంది మరి.. బన్నీ సినిమా రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే
x

Kollywood: అట్లీతో అట్లుంది మరి.. బన్నీ సినిమా రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Highlights

Kollywood: కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఒకప్పటి వరకు దక్షిణ భారత చిత్రసీమకే పరిమితమైన ఆయన పేరు, ‘జవాన్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా మారుమోగింది.

Kollywood: కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఒకప్పటి వరకు దక్షిణ భారత చిత్రసీమకే పరిమితమైన ఆయన పేరు, ‘జవాన్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా మారుమోగింది. షారుక్ ఖాన్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం, ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడంతో అట్లీకి భారీగా క్రేజ్‌ వచ్చింది. దీంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు అతనితో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో అట్లీ రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

అట్లీ తనతదుపరి చిత్రాన్ని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. పుష్ప2తో నేషనల్‌ వైడ్‌గా ఫాలోయింగ్ సంపాదించుకున్న బన్నీతో భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదని చెప్పాలి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ లేటెస్ట్‌ అప్‌డేట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

అల్లుఅర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ సినిమా చూయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ అట్లీతో పాన్‌ ఇండియా స్థాయిలో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు అట్లీ కూడా భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొన్ని వార్తల ప్రకారం, అట్లీ ఈ చిత్రానికి ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడట. ఇది నిజమైతే, అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే దర్శకుల జాబితాలో అట్లీ ముందు వరుసలో ఉంటాడు. మరి నెట్టింట జరుగుతోన్న ఈ ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories