Kanguva Movie Records: 'కంగువా' ఇండస్ట్రీలో కొత్త రికార్డును సెట్ చేయనుందా?


Kanguva Movie
Kanguva Movie Records: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), డైరెక్టర్ శివ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కంగువా (Kanguva) మూవీ మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది.
Kanguva Movie Records: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలు ప్రయోగాత్మక సినిమాలు తీయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. వారు ఎంచుకున్న కంటెంట్‌ని బట్టి తెరపై కొత్తగా కనిపించడానికి ఆసక్తిని చూపుతున్నారు. తమ కెరియర్లో ఎప్పటికీ నిలిచిపోయే ఓ అద్బుతమైన మార్క్ ఒకటి సృష్టించాలనే ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు నిర్మాతలు కూడా ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించడానికి వందల కోట్లను ఖర్చు చేయాడానికి వెనుకాడడం లేదు. అలాంటి సినిమాల్లో కంగువా కూడా ఒకటి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, డైరెక్టర్ శివ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కంగువా మూవీ మరో మూడు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ పాత్రలో, దిశా పటాని హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం నవంబర్ 14న వరల్డ్ వైడ్‌గా 10 కి పైగా భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
మరోవైపు ఇటీవల తమకు చెల్లించాల్సిన రుణం మొత్తం చెల్లించలేదని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అయితే రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, స్టూడియో గ్రీన్ మధ్య ఎలాంటి సమస్య లేకుండా గొడవ ముగిసినట్టు తెలుస్తోంది. మొత్తానికి గొడవ ముగియడంతో కంగువా టీమ్ ఊపిరి పీల్చుకుంది. రిలయన్స్ సంస్థకు చెల్లింపులు క్లియర్ కావడంతో ఇక సినిమా విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్.. మూవీపై మరింత హైప్ పెంచేసింది. ఇక ట్రైలర్ చూస్తుంటే రెండు కాలాలకు లింక్ చేసి ఉండే కథలా ఉంది. ఫుల్ యాక్షన్ సీన్స్‌తో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సూర్య కెరియర్లోనే కాదు.. తమిళనాట కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతుందనే టాక్ వినిపిస్తోంది. వెయ్యి కోట్ల రూపాయలు కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ స్థాయిని కంగువా అందుకుంటుందేమో చూడాలి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire