Vikram: మహేష్ బాబు కోసం విలన్ గా మారబోతున్న స్టార్ హీరో

Kollywood Actor Vikram Acting as Villain with Mahesh Babu in the Direction of SS Rajamouli New Movie
x

మహేష్ బాబు కోసం విలన్ గా మారబోతున్న స్టార్ హీరో(ఫైల్ ఫోటో)

Highlights

* రాజమౌళి సినిమాలో విలన్ పాత్ర కి రెడీ అవుతున్న విక్రమ్

Vikram: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఒక పొలిటికల్ ఎంటర్టైనర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమాని సైన్ చేశారు. తాజాగా రాజమౌళి మహేష్ బాబు సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సినిమాలో విలన్ పాత్ర కోసం ఒక మంచి పేరున్న నటుడి కోసం వెతుకుతున్న రాజమౌళి ఆ పాత్రకి కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ బాగా సూట్ అవుతారని అనిపించి ఆయన ను సంప్రదించారట. త్వరలోనే ఆ పాత్ర గురించి వీరిద్దరూ కలిసి డిస్కస్ చేయబోతున్నారు.

మరి స్టార్ హీరో గా మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ ఇప్పుడు ఈ సినిమాతో విలన్ గా మారతారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని సినిమా ఈ సినిమాకి స్క్రిప్ట్ ని అందిస్తున్న విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories