Kiran Abbavaram: యంగ్ హీరో సినిమాపై భారీ ప్లాన్.. ఒక్క పాట కోసం..

Kiran Abbavaram Will Be Shooting in Ramoji Film City | Tollywood
x

కిరణ్ అబ్బవరం సినిమా కోసం స్పెషల్ షూటింగ్ సెట్స్

Highlights

*కిరణ్ అబ్బవరం సినిమా కోసం స్పెషల్ షూటింగ్ సెట్స్

Kiran Abbavaram Movie: యువ హీరో కిరణ్ అబ్బవరం "రాజావారు రాణిగారు" అనే సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత "ఎస్ ఆర్ కళ్యాణమండపం" అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న కిరణ్ ఈ మధ్యనే "సెబాస్టియన్ పీ సీ 524" సినిమాలో కనిపించారు. తాజాగా ఇప్పుడు కిరణ్ రమేష్ కాడూరి అనే ఒక కొత్త డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కోసం దర్శకనిర్మాతలు రామోజీ ఫిలిం సిటీలో ఒక స్పెషల్ సెట్ ని కూడా నిర్మించారు.ఒక స్పెషల్ సాంగ్ పాట చిత్రీకరణ ఇక్కడ జరగబోతున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అతి భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలోని ఓ పాట కోసం ఏకంగా రూ. కోటి ఖర్చు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. సాయి కార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. అతుల్య రవి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. వెంకట్ సి దిలీప్ ఈ సినిమా కోసం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories