Kiran Abbavaram: సినిమా బాగా లేదు అన్నారు కానీ బ్లాక్ బస్టర్ అయింది..

Kiran Abbavaram: "రాజావారు రాణి గారు", "ఎస్ ఆర్ కళ్యాణమండపం" వంటి సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం

Arun Chilukuri
Updated on: 27 Jun 2022 6:00 PM IST
Kiran Abbavaram Speech In Sammathame Movie Success Meet
X

Kiran Abbavaram: సినిమా బాగా లేదు అన్నారు కానీ బ్లాక్ బస్టర్ అయింది..

Kiran Abbavaram: "రాజావారు రాణి గారు", "ఎస్ ఆర్ కళ్యాణమండపం" వంటి సినిమాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా "సమ్మతమే" సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉండబోతోందని కానీ చాలా వరకు ఎంటర్టైన్మెంట్ కే పెద్దపీట వేశారని చెప్పినప్పటికీ సినిమా క్రిటిక్స్ నుంచి నెగటివ్ రెస్పాన్స్ ని మాత్రమే అందుకుంటోంది.

తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ, "సినిమాలు చూస్తూనే పెరిగాను. ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేయాలో నాకు తెలుసు. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా రిలీజ్ అయినప్పుడు నేను డైలాగులు సరిగ్గా రాయలేదని, నా కెరీర్ అయిపోయిందని చాలామంది అన్నారు" అని చెప్పుకొచ్చారు కిరణ్. "కానీ ఆ రోజు సాయంత్రమే సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ అని టాక్ బయటకు వచ్చింది. సమ్మతమే సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది" అని క్లారిటీ ఇచ్చారు కిరణ్.

"సమ్మతమే ఒక చిన్న సింపుల్ పాయింట్ చుట్టూ తిరుగుతుంది కానీ మేము దాన్ని చాలా బాగా నెరేట్ చేసాము. కొంతమంది కంప్లీట్ గా నెగిటివ్ రివ్యూ ఇచ్చారు కానీ అది ఎందుకో నాకు అర్థం కాలేదు. లవర్స్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చింది. నా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని అన్నారు కిరణ్ అబ్బవరం. ఇక ఆ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ పాయింట్ ని చేరుకుందని నిర్మాతలు ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story