పవన్ కళ్యాణ్ తో పోలిక గురించి రియాక్ట్ అయిన కిరణ్ అబ్బవరం

* పవన్ కళ్యాణ్ తో పోలిక గురించి రియాక్ట్ అయిన కిరణ్ అబ్బవరం

Arun Chilukuri
Updated on: 22 Feb 2023 9:31 PM IST
Kiran Abbavaram Reacts On Trolls
X

అసలు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని కిరణ్ అబ్బవరాన్ని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

Kiran Abbavaram: యువ హీరో కిరణ్ అబ్బవరం ఈమధ్యనే విడుదల అయిన "వినరో భాగ్యము విష్ణు కథ" సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కిరణ్ తనపై అవసరం లేని ట్రోల్స్ చేస్తున్న వారి గురించి రియాక్ట్ అయ్యాడు. 70 వేల జాబ్ వదులుకొని మరి సినిమాల మీద ఇష్టంతోనే ఇండస్ట్రీకి వచ్చానని ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని అన్నాడు కిరణ్ అబ్బవరం.

ఇక పవన్ కళ్యాణ్ తో పోలిక గురించి మాట్లాడుతూ, "అసలు పవన్ కళ్యాణ్ గారితో నాకు పోలిక ఏంటి. నేను ఇప్పుడిప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్నాను. ఆయన ఎన్నో కష్టాలు పడి ఆ స్థాయికి వచ్చారు," అన్న కిరణ్ కావాలనే కొందరు తనను టార్గెట్ చేస్తున్నారని అంటున్నాడు. అయితే కిరణ్ రెస్పాన్స్ పై మరికొందరు వెరైటీ కామెంట్లు చేస్తున్నారు. తన సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా తన గురించి వచ్చిన కామెంట్లపై రియాక్ట్ అవుతూ మరొకసారి కిరణ్ రియాక్ట్ అయ్యి వార్తల్లో నిలుస్తున్నాడు అని, అలాంటి అవసరం లేదని చెబుతున్నారు.

మరోవైపు అభిమానులు మాత్రం తన ఆవేదన వ్యక్తం చేయటం లో తప్పేముందని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే "వినరో భాగ్యం విష్ణు కథ" బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను చేరుకున్న ఈ సినిమా ఇప్పుడు మంచి లాభాలను తీసుకువస్తుంది. ధనుష్ నటించిన "సార్" సినిమా పోటీ ఉన్నప్పటికీ "వినరో భాగ్యం విష్ణు కథ" మంచి కలెక్షన్లతో ముందుకు దూసుకుపోతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story