నన్ను సినిమా ఇండస్ట్రీ నుంచి పంపించేందుకు ప్రయత్నాలు.. కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు..

* తనపై వస్తున్న మీమ్స్ గురించి రియాక్ట్ అయిన కిరణ్ అబ్బవరం

Dhatripriya
Updated on: 11 Jan 2023 1:00 PM IST
Kiran Abbavaram Reacts On Trolls
X

నన్ను సినిమా ఇండస్ట్రీ నుంచి పంపించేందుకు ప్రయత్నాలు.. కిరణ్ అబ్బవరం సంచలన వ్యాఖ్యలు..

Kiran Abbavaram: "రాజా వారు రాణీగారు" సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అయిన కిరణ్ అబ్బవరం ఆ తరువాత "ఎస్.ఆర్. కల్యాణ మండపం" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ కెరీర్ లో బాగానే ముందుకు దూసుకు వెళ్తున్నాడు ఈ యువ హీరో. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అందులో మొదటిది "వినరో భాగ్యము విష్ణుకథ". త్వరలోనే ఈ చిత్రం విడుదల కు సిద్ధం అవుతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ సినిమా ను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మురళీ కిషోర్ అబ్బురు ఒక కొత్త డైరెక్టర్ ఈ సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఓ షోలో పవర్ స్టార్ తర్వాత నువ్వే అని హైపర్ ఆది కిరణ్ అబ్బవరం తో అనడం, దానికి కిరణ్ అబ్బవరం థ్యాంక్స్ చెప్పడంతో కిరణ్ పై ట్రోలింగ్ మొదలైంది. దీని గురించి స్పందించాడు కిరణ్.

"నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమాలో నా పేరు కిరణ్ అబ్బవరం అనే ఉంటుంది. కానీ మీమర్స్ మాత్రం నా పేరుకు ముందు పవర్ స్టార్ యాడ్ చేసి ట్రోల్ చేశారు. కావాలనే కొందరు నా మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. నన్ను ఇండస్ట్రీ నుంచి పంపించేయాలని చూస్తున్నారు. నాపై వస్తున్న ట్రోలింగ్స్ కు నేను స్పందించకపోవడం వల్లే ఇలా అవుతోంది. నేను చేయని తప్పుకు నన్ను అనకండి," అంటూ ట్రోలర్స్ కి కిరణ్ అబ్బవరం జవాబు చెప్పే ప్రయత్నం చేశాడు. మరి ఇకనైనా ట్రోలర్స్ మీమ్స్ ఆగుతారా లేదా చూడాలి.

Dhatripriya

Dhatripriya

Next Story