Kiran Abbavaram: వాళ్లందరికీ ఒక్కటే సమాధానం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram: ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కూడా ఒకరు.

Arun Chilukuri
Published on: 18 July 2022 3:02 PM IST
Kiran Abbavaram Pens an Emotional Note
X

Kiran Abbavaram: వాళ్లందరికీ ఒక్కటే సమాధానం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కిరణ్ అబ్బవరం..

Kiran Abbavaram: ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కూడా ఒకరు. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్‌ మొదటి చిత్రం 'రాజావారు రాణిగారు'తో మెప్పించారు. ఆ సినిమా విజయంతో వరుస ప్రాజెక్ట్‌లలో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగు కొత్త ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్న ఆయన తాజాగా ట్విటర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు.

ఇటీవల తన పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ.. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్, నా తదుపరి చిత్రాలు.. ఇలా జీవితంలోని ప్రతిదశలో అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. నా ఎదుగుదలకు సపోర్టే ఇంధనం. దానికి థ్యాంక్స్ మాత్రమే సరిపోదు. మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను. ఇన్ని సినిమాలు ఎలా వస్తున్నాయి ? బ్యాగ్రౌండ్ ఏంటీ ? గట్టి సపోర్ట్ ఉందేమో ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ నా సమాధానం ఒక్కటే హార్ట్ వర్క్. క్లాసులో మనకు తక్కువ మార్కులు వచ్చాయన్న దానికంటే పక్కవాడికి ఎక్కువ మార్కులు ఎలా వచ్చాయనే బాధ, నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి నెగిటివిటీ నాపై వస్తోంది. అంటే జీవితంలో నేనేదో పాజిటివ్ గా సాధించానని అర్థం. ఈ పని కోసమే ఎన్నో ఏళ్లు తిరిగాను. నేను కోరుకున్న పని నాకు వచ్చినప్పుడు దాన్ని ఇష్టపడి చేస్తున్నా " అంటూ కిరణ్ రాసుకొచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story