NTR30: కియారా అద్వానీ, అనిరుధ్ లతో ఎన్టీఆర్?

NTR30: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో త్వరలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

Venkata Chari
Updated on: 7 Jun 2021 9:31 PM IST
Kiara Advani & Anirudh locked for NTR30
X

జూనియర్ ఎన్టీఆర్ (ఫొటో ట్విట్టర్)

NTR30: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో త్వరలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో గతంలో జనతా గ్యారేజ్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రెండో సినిమా కోసం పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ఫిల్మ్ నగర్ లో తాజా నివేదికల మేరకు హీరోయిన్‌గా కియారా అద్వానీ, మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్ ఈ సినిమా కోసం పనిచేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, వీరిద్దరితో జూనియర్ ఎన్టీఆర్ పనిచేయడం మొదటిసారి. ఇదివరకే అనిరుధ్ తో ఎన్టీఆర్ పనిచేయాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదంట. ప్రస్తుతానికి జానియర్ తో కియారా, అనిరుధ్ మొదటిసారి కలిసి పనిచేయనున్నారు. కొరటాల శివతో కలిసి అనిరుధ్ పనిచేయడం కూడా ఇదే మొదటిసారి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.

Venkata Chari

Venkata Chari

Next Story