సమంత కారణంగా ఇబ్బందులు పడుతున్న విజయ్ దేవరకొండ.. అసలేమైందంటే?

Khushi Movie Getting Delayed due to the Dates of Samantha
x

సమంత కారణంగా ఇబ్బందులు పడుతున్న విజయ్ దేవరకొండ.. అసలేమైందంటే?

Highlights

సమంత వల్ల ఆలస్యం కానున్న "ఖుషి"?

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాపులర్ అయిన యువ హీరో విజయ్ దేవరకొండ మాత్రం గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. "వరల్డ్ ఫేమస్ లవర్" సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఈమధ్యనే నటించిన సినిమా "లైగర్" తో కూడా మెప్పించలేకపోయారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయాల్సిన మరొక సినిమా అయిన "జనగణమన" సినిమాకి కూడా బ్రేకులు పడిపోయాయి. తాజాగా తన ఆశలన్నీ "ఖుషి" సినిమా పైన పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ. శివ నిర్వాణా దర్శకత్వంలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

నిజానికి ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇంకా సినిమాకి సంబంధించి 30 రోజులపాటు షూటింగ్ పెండింగ్లో ఉంది. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సమంత ఇటు షూటింగులలో కూడా పాల్గొనడం లేదు. ఒకవేళ అక్టోబర్ లోపల సినిమా షూటింగ్ తిరిగి మొదలవకపోతే ఈ సినిమా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాని వాయిదా వేసి వచ్చే సంవత్సరం వేసవి కాలంలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories