శ్రీదేవి కూతురుతో దర్శకేంద్రుడి పెళ్ళిసందడి?

శ్రీదేవి కూతురుతో దర్శకేంద్రుడి పెళ్ళిసందడి?
x
Highlights

తాజా సమాచారం ప్రకారం ఇందులో ఇద్ద‌రు క‌థ‌నాయిక‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. అందులో అందాల తార, దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి క‌పూర్‌ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ తారాగణంతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'పెళ్లి సందడి' చిత్రం ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ తో తాజాగా తన కొత్త సినిమాని అనౌన్స్ చేశారు రాఘవేంద్రరావు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపైన గత కొద్ది రోజులుగా సస్పెన్స్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఇద్ద‌రు క‌థ‌నాయిక‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. అందులో అందాల తార, దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి క‌పూర్‌ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మ‌రో హీరోయిన్‌గా మల‌యాళ బ్యూటీ మాళ‌విక నాయ‌ర్‌ని ఎంపిక చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. గౌరీ రోనంకి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

అటు దాదాపుగా మూడేళ్ళ తర్వాత రాఘవేంద్రరావు నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. రాఘవేంద్రరావు చివరిగా అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంక‌టేశాయ అనే భక్తీరస చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో వచ్చిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్ళీ అయన సినిమాలను చేయలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories