Khiladi Movie Team: "ఖిలాడి" ప్రీమియర్స్ నిలిపివేసిన చిత్రబృందం

Khiladi Movie Team: కంటెంట్ డిలే వల్ల ప్రీమియర్ లు నిలిపివేసిన "ఖిలాడి" దర్శకనిర్మాతలు

admin1
Updated on: 9 Feb 2022 4:00 PM IST
Khiladi Film Crew Stopped the Premieres | Telugu Movie News
X

Khiladi Movie Team: "ఖిలాడి" ప్రీమియర్స్ నిలిపివేసిన చిత్రబృందం

Khiladi Movie Team: వరుస డిజాస్టర్ లతో సతమతమౌతున్న మాస్ మహారాజా రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో ఎట్టకేలకి ఒక సూపర్ హిట్ అందుకున్నారు. ఇక త్వరలోనే రమేష్ వర్మ దర్శకత్వంలో లో రవితేజ హీరోగా నటించిన "ఖిలాడి" సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అనుకున్న స్థాయిలో కాకపోయినా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక హిందీ లో కూడా "ఖిలాడి" అనే టైటిల్ తోనే విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కి యూఎస్ ప్రీమియర్ వేయటం లేదట. కంటెంట్ డిలే కారణంగా సినిమాకి సంబంధించిన యూఎస్ ప్రీమియర్ లను నిలిపివేసినట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీంతో సినిమా ఫిబ్రవరి 11 నుంచి మాత్రమే థియేటర్లలోకి రాబోతోంది. అర్జున్ సర్జా మరియు ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి "క్రాక్" సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఈ సినిమాతో ఎంత వరకు హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

admin1

admin1

Next Story