"ఖిలాడి" డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా

Khiladi Director Ramesh Varma to Team up With Pawan Kalyan for a Film
x

"ఖిలాడి" డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా

Highlights

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్నారు.

Pawan Kalyan: ఈ మధ్యనే "వకీల్ సాబ్" సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "భీమ్లా నాయక్" సినిమాతో బిజీగా ఉన్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. మరోవైపు క్రిష్ డైరెక్షన్లో "హరిహర వీరమల్లు" సినిమాతో కూడా పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం తన చేతిలో ఇన్ని పెద్ద ప్రాజెక్టులు ఉన్న పవన్ కల్యాణ్ తాజాగా ఇప్పుడు మరొక డైరెక్టర్ సినిమాకి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు రమేష్ వర్మ.

ఒక ఊరిలో సినిమాతో డైరెక్టర్ గా మారిన రమేష్ వర్మ 2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన "రాక్షసుడు" సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రవితేజ హీరోగా "ఖిలాడి" సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరీలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల కాబోతోంది. రమేష్ వర్మ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కు ఒక కథ వినిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు రమేష్ వర్మ ఈ కథ గురించి డిస్కషన్ లు జరుపుతున్నారట. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories