Lokesh Kanagaraj: షూటింగ్ పూర్తి చేయడానికి నెల రోజులు చాలు అంటున్న డైరెక్టర్

Lokesh Kanagaraj: "ఖైదీ" సినిమా షూటింగ్ అప్పుడే "ఖైదీ 2" సన్నివేశాలను కూడా చిత్రీకరించామంటున్న లోకేష్ కనగరాజ్

admin1
Updated on: 19 Nov 2021 6:30 PM IST
Lokesh Kanagaraj: షూటింగ్ పూర్తి చేయడానికి నెల రోజులు చాలు అంటున్న డైరెక్టర్
X

షూటింగ్ పూర్తి చేయడానికి నెల రోజులు చాలు అంటున్న డైరెక్టర్ (ఫైల్ ఇమేజ్)

Lokesh Kanagaraj: 2019లో కార్తీ హీరో గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా "ఖైదీ". లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది ఆగస్టులో టొరంటోలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ చిత్రాన్ని స్క్రీన్ చేశారు. ఢిల్లీ అనే ఒక హంతకుడు జైలు నుంచి విడుదలై తన కూతుర్ని మొట్టమొదటిసారిగా చూడటానికి వెళుతూ ఉండగా ఒక డ్రగ్ రైడ్ లో ఇరుక్కుంటాడు.

ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా. సినిమా మొదటి సీన్ నుంచి లోకేష్ కనగరాజ్ ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను అలరించారు. సినిమా ఆఖర్లో ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉండబోతోందని హింట్ కూడా ఇచ్చారు దర్శకుడు. తాజాగా "ఖైదీ" సీక్వెల్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు లోకేష్. సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి నెల రోజులు సరిపోతాయని అన్నారు. "ఖైదీ" సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే "ఖైదీ 2" లో కొన్ని సన్నివేశాల్లో షూటింగ్ పూర్తి చేశామని చెప్పారు.

admin1

admin1

Next Story