ప్రమోషన్ లకు నో చెబుతున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 నిర్మాతలు

*ప్రమోషన్ లకు నో చెబుతున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 నిర్మాతలు

admin1
Updated on: 12 April 2022 6:00 PM IST
KGF Producers are Not Interested in Promotions | Tollywood News
X

 ప్రమోషన్లపై ఆసక్తి చూపించని కేజిఎఫ్ నిర్మాతలు

KGF 2 Promotions: ప్రస్తుతం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "కే జి ఎఫ్ చాప్టర్ 2". ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇంతకుముందు బ్లాక్ బస్టర్ అయిన "కే జి ఎఫ్ చాప్టర్ 1" సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కనుంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఆడియో ఈవెంట్లు తో దర్శక నిర్మాతలు సినిమా పై మరింత క్రియేట్ చేయాల్సి ఉంది.

నిజానికి ప్రమోషన్లు అనగానే గుర్తొచ్చేది రాజమౌళి. "ఆర్ఆర్ఆర్" సినిమా కోసం రాజమౌళి తిరగని రాష్ట్రం లేదు ఇవ్వని ఇంటర్వ్యూ లేదు అనడంలో అతిశయోక్తి కూడా లేదు. ఇక "కే జి ఎఫ్ చాప్టర్ 2" కూడా ప్యాన్ ఇండియన్ సినిమా కావడంతో అదే రేంజ్ లో ప్రమోషన్లు ఉంటాయి అని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం కేజీఎఫ్ నిర్మాతలు ప్రమోషన్ల మీద అంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం చేయడానికి ఏమాత్రం ఇష్టం ఆసక్తి చూపించడం లేదట.

ఇప్పటిదాకా ఏ భాషలో ను చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయలేదు. ఆఖరికి దర్శకనిర్మాతలు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొనడం లేదు. ఎంత ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కనీసం చిన్న సినిమాని ప్రమోట్ చేసినట్లు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయకపోవడం అభిమానులను షాక్కు గురి చేస్తోంది. మరోవైపు నిర్మాతలు మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టేది లేదు అని భీష్మించుకుని కూర్చున్నారు.

admin1

admin1

Next Story